హార్ట్ అటాక్ తో కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ విశాల్ (24) ఈరోజు ఉదయం సికింద్రాబాద్ లోని ఓ జిమ్ కు వెళ్లి ఎక్సర్ సైజ్ చేస్తూ ఒక్కసారిగా కిందపడి పోయాడు. గమనించిన జిమ్ సిబ్బంది.. అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతి చిన్న వయస్సులోనే అతనికి గుండెపోటు రావడం భయాందోళన కలిగిస్తోంది.
కొద్ది సంవత్సరాల క్రితం వయస్సు మీద పడిన వారికి, స్థూలకాయం ఉన్న వారికి గుండెపోటు వస్తుండేది. కానీ ఇప్పుడు వయస్సు, ఊబకాయంతో సంబంధం లేకుండా గుండె ఆగిపోతోంది. సన్నగా ఉన్నా, నిత్యం వ్యాయామం చేస్తున్నా సరే గుండె పోటు ముప్పు నుంచి తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి.