హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపై కాంగ్రెస్ లో వాడీ వేడీ చర్చ జరుగుతోంది. ఓటమికి కారణం నువ్వంటే నువ్వని ఆరోపణలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి… ఉత్తమ్ వర్గంగా నేతలు చిలిపోయారు. పొన్నం ప్రభాకర్… ఉత్తమ్ కుమార్ రెడ్డి ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కొందరు టిఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా పని చేశారన్న పొన్నం వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.బ్లడీ ఫూల్ అని పొన్నం పై ఉత్తమ్ ఫైర్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ బ్లాక్ మెయిలర్ అని.. తప్పు గా మాట్లాడితే చెప్పుతో కొడతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని ఉత్తమ్ వార్నింగ్ ఇచ్చారు. పెద్ద పెద్ద మీటింగులు పెట్టీ ఏం సాధించారు.. అని ఉత్తమ్ నిలదీశారు. వెంకట్ కి టికెట్ ఇవ్వడం తప్పన్నారు. ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వెనకబడటం ఖాయమన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement