Monday, November 25, 2024

కర్నాటకలో కాంగ్రెస్​దే విజయం.. సింగిల్​గానే 150 సీట్లు సాధిస్తాం: డీకే శివకుమార్​

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీల సపోర్ట్​ లేకుండానే కాంగ్రెస్​ పార్టీ 150 సీట్లు గెలుచుకుంటుందని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. బళ్లారిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏ పార్టీ మద్దతు లేకున్నా తాము150 సీట్లు (కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో) టచ్ చేస్తామని, కర్నాటక ప్రజలు 150 సీట్లకు స్పష్టమైన తీర్పు ఇస్తారని చెప్పుకొచ్చారు.

బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ మధ్య దూకుడుగా ప్రచారం చేసింది. పోస్టర్లు, బ్యానర్లతో బొమ్మైకి వ్యతిరేకంగా ‘పేసీఎం’ వంటి ప్రచారాన్ని ఉధృతం చేసింది. భారత్ జోడో యాత్రలో కూడా పార్టీ కార్యకర్తలు ‘PayCM’ టీ-షర్టులు ధరించి కనిపించారు.

PayCM పోస్టర్‌పై ముఖ్యమంత్రి ఫొటోతో QR కోడ్​ ఏర్పాటు చేశారు. ఆ కోడ్​ని స్కాన్ చేసినప్పుడు, బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పబ్లిక్ వర్క్స్ పై 40 శాతం కమీషన్ తీసుకుంటున్నట్టు ‘40% సర్కార్​’ అనే వెబ్‌సైట్‌కి అది లాగిన్​ అవుతోంది. ఇట్లా బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ చేపట్టిన ప్రచారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వెంటనే బెంగళూరులో ‘PayCM’ పోస్టర్లను తొలగించారు.

- Advertisement -

ఇక.. మాజీ సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని ఒక వర్గం, డీకే శివకుమార్​ నేతృత్వంలోని మరో వర్గం మధ్య కర్నాటక కాంగ్రెస్​లో పోరు సాగుతోంది. అయినా.. డీకే శివకుమార్ తాము 150 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే కర్నాటక యాత్ర ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య.. డీకే శివకుమార్​ కలిసి డప్పు వాయిస్తున్న ఫొటోలు సంచలనంగా మారాయి.-  

సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ కర్నాటకలోని ఓల్డ్ మైసూరు ప్రాంతానికి చెందినవారే. సిద్ధరామయ్య దావణగెరె ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలను, అభిమానులను తరలించి క్రౌడ్-పుల్లర్‌గా నిరూపించుకున్నారు.. DK శివకుమార్​ తన వొక్కలిగ సంఘం నుండి మద్దతును కూడగట్టడానికి యత్నిస్తున్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement