Saturday, November 23, 2024

కె రైల్ ప్రాజెక్టు.. కేరళ కాంగ్రెస్ లో ముసలం.. శ‌శిథ‌రూర్ పై ఆగ్ర‌హం..

కేరళ కాంగ్రెస్ పార్టీలో ముసలం కొనసాగుతోంది. ఆ పార్టీ చీఫ్ సొంత పార్టీ ఎంపీ శశి థరూర్‌కు వార్నింగ్ ఇవ్వడంతో కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అనే తీరు నడుస్తోంది. వామపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన కే-రైల్ (కేరళ హైస్పీడ్ రైల్) ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు పిటిషన్ దాఖలే చేశాయి. ఈ పిటిషన్ పై శశి థరూర్ సంతకం చేయకపోవడంపై కేరళ కాంగ్రెస్ నేతలు కినుక వహించారు. దీనిపై అధ్యయనం చేసేందుకు తనకు మరింత సమయం కావాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ‘‘పార్టీలో శశిథరూర్ ఒంటరి వ్యక్తి.. ప్రతి వ్యక్తి అభిప్రాయానికి అర్హులే.. పార్టీ శ్రేణులు అంగీకరిస్తేనే కొనసాగుతానని.. వాళ్లు అంగీకరించకుంటే పార్టీలో ఉండను అంతే’’ అని కాంగ్రెస్ కేరళ యూనిట్ చీఫ్ కె సుధాకరన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ నెల ప్రారంభంలో మిస్టర్ థరూర్ తన పేరును పిటిషన్‌లో ఉంచకూడదని పార్టీ శ్రేణులకు తెలిపారు.

“ఎలాంటి అపార్థాలకు ఆస్కారం లేదు. ఈ ప్రాజెక్ట్‌కు నేను ఎటువంటి మద్దతు ఇవ్వలేదు. ఇంత పెద్ద సమస్య వచ్చినప్పుడు, దాని గురించి వివరంగా చర్చించాల్సిన బాధ్యత మనపై ఉంది. అయితే ఇది వ్యతిరేకించడం మాత్రం కాదు” అని డిసెంబర్ 15న పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విలేకరులతో అన్నారు.

అయితే K -రైల్ సిల్వర్‌లైన్ ప్రాజెక్ట్ హై-స్పీడ్ రైలు కారిడార్‌ను ఏర్పాటు చేయడం లక్ష్యంగా కేరళ ప్రభుత్వం పెట్టుకుంది, ఇది కేరళలోని ఒక చివరనుంచి మరో చివరను కలుపుతుంది. ప్రయాణ సమయాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. 532 కిలోమీటర్ల కారిడార్‌కు ₹63,941 కోట్లు ఖర్చవుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లుతుందని, అధికంగా ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. లెఫ్ట్ ఫ్రంట్ మిత్రపక్షమైన సీపీ కూడా డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును బహిరంగపరచాలని డిమాండ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement