కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజస్థాన్ లో ఏకంగా ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అందించారు. కాగా రెండు రోజుల్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం క్యాబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించనున్న తరుణంలో ముగ్గురు మంత్రులు తమ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజీనామా చేసిన వారిలో రెవన్యూశాఖ మంత్రి హరీశ్ చౌదరీ, వైద్యశాఖ మంత్రి రఘు శర్మ, విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోస్తారాలు ఉన్నారు. కాగా వీరు క్యాబినెట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మంత్రిపదవులకు రాజీనామా చేసినా పార్టీతో పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు. కాగా వీరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తులు.. రాజీనామా చేసిన వారిలో దోస్తారా రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండగా.. రఘు శర్మ గుజరాత్ ఇంచార్జీగా ఉన్నారు.. మరోమంత్రి హరీష్ చౌదరీ పంజాబ్ ఇంచార్జీగా కొనసాగుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..