Saturday, November 23, 2024

మల్లికార్జున్ ఖర్గేతో నాకు శత్రుత్వం లేదు-శ‌శిథ‌రూర్

త‌మ పార్టీలో కొన్ని లోపాలు ఉన్నాయ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు శ‌శిథ‌రూర్ అన్నారు.ఢీల్లీలో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నికైతే 2014, 2019లో పార్టీతో ఉండ‌ని ఓట‌ర్లను తిరిగి తీసుకువ‌స్తాన‌ని అన్నారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా పార్టీ అధ్యక్ష ప‌దవికి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేద‌ని చెప్పారు. పార్టీ మార్పుతో ముందుకు సాగాలని మీరు కోరుకుంటున్నారా లేక ఇప్పుడు అంతా బాగానే ఉంద‌ని సంతృప్తిగా ఉన్నారా ..అంతా బాగానే ఉంద‌ని మీకు అనిపిస్తే.. 2014, 2019 సంవ‌త్స‌రంలో మ‌న పార్టీతో ఉండ‌ని ఓట‌ర్ల‌ను తిరిగి తీసుకురావాల‌ని కోరుకుంటున్నా. అలాంటి మార్పు కోసం ప‌ని చేయాల‌ని అనుకుంటున్నా.. కాబ‌ట్టి నాకు ఓటు వేయొద్దు. మల్లికార్జున్ ఖర్గేతో నాకు శత్రుత్వం లేదు. ఇద్దరం కాంగ్రెస్ నాయకులుగా పోటీ చేస్తున్నాం. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక జరగనుందని, ఎన్నిక‌ల ఫ‌లితాలు 19వ తేదీన వెలువ‌డ‌నున్నాయ‌ని శ‌శి థ‌రూర్ చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులను ఎన్నుకోవడానికి కూడా ఎన్నికలు జరగాలని ఆయ‌న చెప్పారు. దీని వ‌ల్ల పీసీసీ ప్రతినిధులకు కూడా ప్రాముఖ్యత లభిస్తుంద‌ని చెప్పారు. అలాగే త‌మ పార్టీలో ఆఫీస్ బేరర్ల నియామకాల్లో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా త్వరలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేపై..శ‌శి థరూర్ పోటీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement