హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరా హోరి పోటీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తి కాగా.. ప్రతి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలినుంచి అనుకున్నట్లే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. ఈ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు డిజిట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రజా ఏక్తా పార్టీ దూసుకుపోతోంది. ప్రజా ఏక్తా పార్టీ తరపున సిలివేరు శ్రీకాంత్ పోటీ చేశారు. శ్రీకాంత్‌కు రోటీ మేకర్ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించింది. అయితే తొలి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీకి 119 ఓట్లు రాగా, ప్రజా ఏక్తా పార్టీకి 122 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 220, ప్రజా ఏక్తా పార్టీకి 158 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 107, ప్రజా ఏక్తా పార్టీకి 43 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్ కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగిన ఓట్లు రాలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60 వేలకు పై చిలుకు ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. అయితే, ఇప్పుడు మారిన రాజకీయ పరిణామల నేపథ్యంలో కాంగ్రెస్ కు దారుణంగా ఓట్లు వచ్చాయి.
Huzurabad Results: అడ్రస్ లేని కాంగ్రెస్.. ప్రజా ఏక్తా పార్టీనే టాప్!
Advertisement
తాజా వార్తలు
Advertisement