హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. కాంగ్రెస్ పార్టీ నిత్యం జనం లో ఉండే విధంగా కార్యాచరణను సిద్ధం చేసుకుం టోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్‌గా కార్య క్రమాలు చేపట్టి.. ఆ రెండు పార్టీలకు తామే ప్రత్యా మ్నాయమని చూపెట్టా లనే ఆలోచనతో మందు కెళ్లేందు కు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంసిద్ధుల వుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్లి.. పార్టీ నాయకు లందరూ కార్యక్రమాల్లో భాగస్వా మ్యులయ్యేలా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే ఇప్పటీకే పార్టీ బలోపేతం, నాయకుల మధ్య సమన్వయానికి కృషి చేస్తున్నారు. ఇక ఎన్నికల డిసెంబర్‌లో ఉన్నందున తన పూర్తి సమయంలో రాష్ట్ర పార్టీకే కేటాయించ నున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్య క్రమంలో భాగంగా టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు పాద యాత్రలు చేస్తుం డగా, ఇక ప్రజా సమస్యలపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎప్పటి కప్పుడు స్పందించేలా నిర్ణయాలు తీసుకుం టున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణను తీసుకుంటుంది. విద్యార్థి, నిరుద్యో గులతో పాటు వివిధ సంఘాలు, పార్టీలతో కలిసి క్షేత్ర స్థాయిలో ఉద్యమించేందుకు సిద్ధం అవు తోంది. అందుకు టీ పీసీసీ సీనియర్ ఉపా ధ్యక్షులు, మాజీ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నియ మించగా, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-1, ఇతరాత్ర పరీక్షలకు దాదాపు 40 లక్షల మంది నిరు ద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తు న్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని కష్టపడి సాధించు కోవాలని.. లక్షల మంది నిరుద్యోగులు సిరియ్‌స్‌గానే ప్రిపేర్ అవుతున్నారు. ఈ పేపర్ లీకేజీ వల్ల.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు నిరాశ, నిస్రృలకు లోనయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపైన నిరుద్యోగులు కోపంగా ఉండి తమ వ్యతిరేకతను బహటంగానే వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల్లో ఉన్న ఈ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు. అందుకు బీజేపీ కంటే ధీటు గానే కార్యక్రమాలు చేపట్టి.. కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వస్తే చేపట్టబోయే వాటిని కూడా వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక వైపు ప్రభుత్వ వైఫల్యాలు, గత ఎన్నికల్లో ఇచ్చిన అమలు కానీ హామీలను ప్రజల ముందు పెడితే .. అది కాంగ్రెస్‌కు ఫలితం వస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దును నిరసిస్తూ.. ఏఐసీసీ అదేశాల మేరకు గాంధీభవన్‌లో పార్టీ సీనియర్లు ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఆ తర్వాత రెండు రోజులు వరసగా జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేపట్టారు. ప్రధాని మోడీతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలతో పాటు దిష్టిబొమ్మలను కూడా కాంగ్రెస్ కేడర్, నాయకులు దగ్ధం చేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇలా రెండు వైపులా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టార్గెట్‌గా కార్యక్రమాలు చేపడితే.. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తారనే యోచనలో పార్టీ నేతలున్నారు.