కాలు జారినా పర్వాలేదు.. కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం. అది కూడా ఓ ప్రజా ప్రతినిధి.. అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. అత్యాచారం అనివార్యం ఐతే మహిళలు ఆనందించాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఎమ్మెల్యే రమేష్ కుమార్. కాగా ఒక గౌరవప్రదమైన కుర్చీలో కూర్చున్న స్పీకర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకి పగలబడి నవ్వడం శోచనీయం. మహిళలని కించపరిచేలా మాటలాడిన ఎమ్మెల్యేకి బుద్దిచెప్పాల్సింది పోయి స్పీకర్ కూడా ఆయనకి వంతపాటడం విడ్డూరం.
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా , అత్యాచార ఘటనలపై చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడంతో దుమ్మెత్తిపోస్తున్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు రమేష్ కుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమెల్యే ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సొంత పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అలాగే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక చీఫ్ ను కోరుతున్నారు. మరి ఏం జరగనుందో తెలియాలి.కాగా ఈ వ్యాఖ్యలతో పెద్ద వివాదం చెలరేగడంతో ఎమ్మెల్యే ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. తాను అన్నా మాటలకి క్షమించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..