Tuesday, November 26, 2024

ష‌ర్మిల దీక్ష‌కు కోమ‌టిరెడ్డి మ‌ద్ద‌తు!

తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చేసినా అంది సంచలనమే. టీ.పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్.. తమ తదుపరి రాజకీయ కార్యచరణ ఏమిటి ? అన్నది సస్పెన్స్ లో పెట్టారు. తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కనని శపథం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇక బీజేపీలో గోడ దూకేదామనుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. అయితే, కోమటిరెడ్డి బ్రదర్స్ చూపు ఇప్పుడు షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైపు మళ్లింది. జులై 8న వైఎస్ఆర్టీపీ ప్రకటన సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి షర్మిలకు అభినందనుల తెలిపారు. అంతేకాదు వైఎస్ కు నివాళిగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా షర్మిలకు జై కొట్టారు.  

మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారారు. చండూరు మండ‌లం, పుల్లెంల గ్రామంలో వైఎస్సార్ తెలంగాణ‌పార్టీ అధ్య‌క్షురాలు షర్మిల చేప‌ట్టిన నిరుద్యోగ నిర‌స‌న దీక్ష‌కు సంఘీభావం ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. తాను ఢిల్లీలో ఉన్నందున ఫోన్ చేస్తున్నాన‌ని.. లేదంటే స్వ‌యంగా వ‌చ్చి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేవాడ‌న‌ని  చెప్పారు. రాజ‌న్న బిడ్డ‌గా త‌మ‌ నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్ట‌డం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ నిరుద్యోగుల‌ను మోసం చేశార‌ని, ఆ స‌మ‌స్య‌పై పోరాటం చేయ‌డం స్వాగ‌తిస్తున్న‌ట్టు్ చెప్పారు. వైఎస్సార్ అంటే త‌మ‌కు ప్రాణమ‌ని.. ఆయ‌న ఎప్ప‌టికీ తమ గుండెల్లో ఉంటార‌ని చెప్పారు. మునుగోడు ప్ర‌జ‌ల‌కు వైఎస్సార్ ఉద‌య స‌ముద్రం ప్రాజెక్టు క‌ట్టించారని.. ఆ ప్రాజెక్టు ద్వారా ల‌క్ష ఎక‌రాల‌కు నీరందించొచ్చ‌ని చెప్పారు. వైఎస్సార్ 90శాతం ప్రాజెక్టు పూర్తి చేస్తే .. కేసీఆర్ ఏడేండ్ల‌లో 10శాతం కూడా కంప్లీట్ చేయ‌లేదని కోమ‌టిరెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు పూర్త‌యితే వైఎస్సార్ కు, త‌మ‌కు మంచి పేరు వ‌స్తుంద‌ని ప‌నులు పూర్తి చేయ‌డం లేదని విమ‌ర్శించారు. మునుగోడులో వైఎస్సార్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నార‌ని చెప్పుకొచ్చారు.

కోమరెడ్డి బద్రర్స్ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరో పార్టీకి మద్దతు ప్రకటించడంపై హస్తం నేతలు మండిపడుతున్నారు. సంచ‌ల‌నాలు సృష్టించడంలో కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్ ముందుంటారు. త‌మ మాట‌ల‌తో, చేత‌ల‌తో  నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు కూడా ఈ ఇద్దరు అన్నదమ్ములు షర్మిలకు మద్దతు ప్రకటించడం వెనుక రాజకీయ కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ కు పీసీసీ ఇవ్వడంతో కోమటిరెడ్డి బద్రర్స్ ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొన లేదు. తమ పని తాము చుసుకుంటున్నారు. షర్మిల పార్టీకి ఇంకా గ్రౌండ్ లెవల్ లో రెడీ కాలేదు. ఆమె చేస్తున్న దీక్షలకు పెద్దగా స్పందన రావడం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతే, కాదు అధికార పార్టీ నేతలు సైతం ఆమెను పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవు. ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ షర్మిలకు మద్దతుగా ఉండడం ఆసక్తి రేపుతోంది.  

ఇది కూడా చదవండి: కేసీఆర్ ఒక్కడే మొనగాడా?.. మునగోడుకొస్తే ఖబడ్దార్: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్

Advertisement

తాజా వార్తలు

Advertisement