తెలంగాణ రాజకీయాలు సస్పెన్స్ సినిమాలను తలపిస్తున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరినామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ఇంటి దొంగలను బయటకి వెళ్లిపోయావాలని ఆదేశించిన రేవంత్.. మాజీ నేతలను మళ్లీ సొంత గూటికి చేర్చుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్లుగా రేవంత్ మార్క్ రాజకీయం సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లో చేరిన నేతలతో సమావేశం అయినా రేవంత్.. వారికి తిరిగి కాంగ్రెస్ పార్టీలో రప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
రేవంత్ రాకతో కాంగ్రెస్ లో పూర్వవైభవం వస్తోంది. కార్యకర్తలో కొత్త జోష్ వచ్చింది. ఇన్నాళ్లు నారాశలో ఉన్న క్యాడర్ ను రేవంత్ బూస్టప్ ఇచ్చారు. మరో రెండేళ్లు కష్టడితే చాలు.. మరో పదేళ్లు మనమే అధికారంలో ఉంటామంటూ కార్యకర్తల్లో భరోసా ఇచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవర్ట్ లను బయటకు పంపే ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. హుజురాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ గతంలో మంత్రి కేటీఆర్ తో భేటీ అయినప్పటి నుంచి ఆయనపై రేవంత్.. దృష్టి పెట్టారు. ఇంటి దొంగ అని ముందే గ్రహించారు. అనంతరం కౌశిక్ రెడ్డి ఆడియో బహిర్గతం కావడం, ఆయన రాజీనామా చేయడం అన్ని చెకచెక జరిగిపోయాయి.
మరోవైపు కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రేవంత్‌రెడ్డి మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. తిరిగి కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరికపై కొండా సంకేతాలిచ్చారు. ఇక, పీసీసీ మాజీ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మొత్తం మీద రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహంతో దూసుకుపోతోంది.
ఇది ఇలా ఉంటే.. పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో వివేక్ రహస్యంగా భేటీ అయ్యారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ మారే విషయమై రెండు గంటల పాటు చర్చలు జరిగినట్లు, వివేక్ తో పాటు మరో కీలక నేత కూడా కాంగ్రెస్ లోకి రానున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే, ఈ వార్త పూర్తిగా అవాస్తవం అని బీజేపీ వర్గాలు అంటున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వివేక్.. రాష్ట్ర విభజన అనంతరం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ సలహాదారుగా పని చేశారు. అయితే, అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ పత్తా లేకుండాపోయింది. అయితే, రేవంత్ పీసీపీ అధ్యక్షుడిగా అయ్యాక సీన్ పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో చాలా మంది మాజీ కాంగ్రెస్ నేతలు తిరిగి సొంత గూటికి చేరుకుంనేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పెరగడం మొదలైంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎంత మంది మాజీ నేతలు కాంగ్రెస్ లో చేరుతారో వేచి చూడాలి.