శ్రీరామనవమి సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్ పై ఎఫ్ ఐఆర్ నమోదయింది. మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ లో హింసాత్మక ఘటనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మను, ఆయన పార్టీని ఇరుకున పెట్టారు. దిగ్విజయ్ ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉంటారని.. ఆయన చేసిన ట్వీట్ నేరపూరిత కుట్రకు సంబంధించినదని, ఇది దేశంలోని పరిస్థితిని చెడగొట్టే ఉద్దేశంతో ఉందని. దీనిపై ఇంటెలిజెన్స్ విచారణ జరపాలని.. సోనియాగాంధీ దిగ్విజయ్ ని ఉద్యమాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉంచుతున్నారన్నారు. ఫిర్యాదుదారు, భోపాల్ నివాసి ప్రకాష్ మండే, ఖర్గోన్ హింసతో దిగ్విజయ్ కి సంబంధం ఉందని ఆరోపించారు. ఈ ట్వీట్ మతపరమైన ఉద్రిక్తతను సృష్టించి మధ్యప్రదేశ్‌లో మత సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్వీట్ ఫిర్యాదు మేరకు క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ మకరంద్ డ్యూస్కర్ తెలిపారు. సెక్షన్లు 153-A (మతం, కులం, జన్మస్థలం ఆధారంగా సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295A (మత మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వక హానికరమైన చర్య), 465 (ఫోర్జరీ), 505(2) కింద కేసు నమోదు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement