హుజురాబాద్ ఉపఎన్నిక వేళ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి షాక్ తగిలింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చినా.. కొందరు సీనియర్లు ఆయనకు సహకరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రేవంత్ తన దూకుడుతో క్యాడర్ కు దగ్గర అవుతున్నా.. ఆయనపై కొందరు నేతలు మాత్రం ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న మల్కాజ్గిరి పార్టీమెంట్ స్థానం పరిధిలోనే పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పంపించారు. హుజురాబాద్ ఉపఎన్నిక వేళ సీనియర్ నేత అయిన ఆకుల రాజేందర్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన టీఆర్ఎస్, బీజేపీ పార్టీలో చేరబోతున్నారా? అన్నది ఉత్కంఠగా మారింది.
ఇది కూడా చదవండి: దళిత బంధు ఆగేది లేదు.. ఈసీపై కేసీఆర్ ఫైర్