Friday, November 22, 2024

Fire onthe Fire: ‘‘ఛి నీయయ్య.. గింత అన్యాలమా? పార్టీని అస్సలు ఎదగనియ్యరారా?’’

‘‘అంతా అయిపోయిందిపో.. ఇక ఈ కాంగ్రెస్​ పార్టీని కాపాడడం ఎవ్వరి తరం కాదు. ఎడ్డెం అంటే తెడ్డెం అనే లీడర్లతో గిట్లనే ఉంటది. ఇట్లాంటి గా..ద కొ..కులు ఉన్నంత కాలం పార్టీ అస్సలు బాగుపడదు”అంటున్నారు చాలామంది అభిమానులు. అవును.. రాజస్థాన్​ కాంగ్రెస్​ పార్టీలో తలెత్తిన సంక్షోభం అంతా గెహ్లోట్​ వల్లనే వచ్చింది. ఇట్లాంటి వ్యక్తి ఏఐసీసీ లీడర్​ అయితే ఇంకేం పార్టీ బాగుంటుంది? అని ఇంకొంతమంది కారాలు మిరియాలు నూరుతున్నరు. ఛి పో అని పార్టీ లీడర్ల తీరును చీదరించుకుంటున్నరు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

రాజస్థాన్​ సీఎం అశోక్ గెహ్లాట్‌కు అనుకూలంగా ఉండే 82 మంది ఎమ్మెల్యేలు నిన్న (ఆదివారం) రాత్రి రాష్ట్ర అసెంబ్లీకి రాజీనామా చేశారు. దీంతో రాజస్థాన్‌లో రాజకీయ నాటకం రంజుగామారింది. జులై 2020లో గెహ్లాట్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన సచిన్​ పైలట్ సీఎం కావడాన్ని తాము ఒప్పుకునేది లేదంటూ ఎమ్మెల్యేలు ఖరాఖండిగా చెబుతున్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత రాజస్థాన్​ సీఎం అశోక్ గెహ్లాట్ గెలిస్తే.. సచిన్ పైలట్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారనే ఊహాగానాలు పెరిగిన తర్వాత ఈ సంక్షోభం తలెత్తింది. కాగా, సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలతో చర్చలు జరపాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పరిశీలకులు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్‌లను ఆదేశించారు.

కాగా, ఇవ్వాల (సోమవారం) మధ్యాహ్నం 3 గంటల తర్వాత కేసీ వేణుగోపాల్‌ సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని గమనించిన రాహుల్​ గాంధీ కొంతమంది నేతలను (వేణుగోపాల్‌వంటి వారిని) కేరళ నుంచి ఢిల్లీకి పంపించారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలో భారత్ జోడో పాదయాత్ర నిర్వహిస్తూ కార్యకర్తలు, లీడర్లలో చైతన్యం తీసుకొస్తున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై రాజస్థాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాని ప్రశ్నించగా.. కాంగ్రెస్‌ పార్టీలోనే సమస్య ఉన్నందున పరిష్కారం కనుగొంటామని ఆయన చెప్పారు. అయితే ఈ పరిస్థితిలో తన పాత్ర ఏమీ లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవికి గెహ్లాట్ రాజీనామాను ఆమోదిస్తారా అని అడిగినప్పుడు అది జరిగినప్పుడు చూద్దాం ఇప్పుడే ఎందుకంత తొందర అంటూ దాటవేశారు.

- Advertisement -

ఇక.. కాంగ్రెస్ పరిశీలకులు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్‌ను కలిసేందుకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ జైపూర్‌లోని మారియట్ హోటల్‌కు వెళ్లారు. అయితే, గెహ్లాట్ హోటల్‌కు వచ్చినప్పుడే మాకెన్ ఢిల్లీకి వెళ్లాల్సి రావడంతో ఆయన ఖర్గేను మాత్రమే కలుసుకోగలిగారు.

కాగా.. రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభంపై అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్‌తో సహా పార్టీ నేతలతో రాహుల్ గాంధీ చర్చించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ పార్టీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం 19వ రోజు కొనసాగుతోంది. ఈరోజు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement