ఈడీ తనముందు హాజరు కావాలని తనకు నోటీసులు ఇచ్చిందని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రారంభించిన దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర మరికొద్ది రోజుల్లో కర్నాటకకు చేరుకోనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇలాంటి సమయంలో ఈడీ తనకు మరోసారి నోటీసులు ఇచ్చిందని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్రంతో పాటు దర్యాప్తు ఏజెన్సీలపై విమర్శలు గుప్పించారు. #BharatJodoYatra, అసెంబ్లీ సమావేశాలు జరగున్న సమయం మధ్యలో.. తమముందు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాకు సమన్లు జారీ చేసింది. నేను ఏజెన్సీలకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను.. కానీ ఈ సమన్లు పంపిన సమయం.. నన్ను వేధించడం నా రాజ్యాంగ-రాజకీయ విధులను విధులను నిర్వర్తించడానికి అడ్డంకిగా వస్తున్నాయని డీకే శివకుమార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఈడీ ముందు హాజరుకావాలని నోటీసులు వచ్చాయ్ – కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్
Advertisement
తాజా వార్తలు
Advertisement