ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీతోపాటు గాంధీల పేరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే దేశం ఎంత బాగుండేదో అన్నారు ప్రధాని. ఆ పార్టీ సమస్య ఏమిటంటే.. అది తన వంశానికి మించి ఎన్నడూ ఆలోచించ లేదు. వంశపారంపర్య పార్టీలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పుగా మారాయి. ఒక కుటుంబం ఎప్పుడైతే తామే సుప్రీం అనుకుంటుందో అప్పుడు దానికి ఫస్ట్ ప్రమాదం ప్రతిభే అవుతుంది. ఇప్పుడు వారి పరిస్థితి అట్లాగే ఉంది, అని ప్రభుత్వ విధానాలపై చర్చలో భాగంగా రాజ్యసభలో ప్రధాని అన్నారు.
‘‘కాంగ్రెస్ లేకపోతే ప్రజలు ఏం ఆలోచిస్తారు. ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా’’ అని కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరుతో జపం చేస్తున్నారని ప్రధాని అన్నారు. అప్పట్లోనే మహాత్మాగాంధీ కాంగ్రెస్‌ను రద్దు చేయాలని కోరుకున్నారని, ఇది మహాత్మా గాంధీ కోరిక.. కానీ, – వారు గాంధీ కోరిను అనుసరించినట్లయితే భారతదేశం బంధుప్రీతి నుండి విముక్తి పొంది ఉండేది” అని మోడీ వ్యాఖ్యానించారు.
‘‘గాంధీ కోరిక మేరకు కాంగ్రెస్ లేకుంటే ప్రజాస్వామ్యం బంధుప్రీతి లేకుండా ఉండేది. దేశం స్వదేశీ బాట పట్టి ఉండేది. ఎమర్జెన్సీ మరక ఉండకపోయేది. దశాబ్దాలుగా అవినీతి సంస్థాగతంగా ఉండేది కాదు. కులతత్వం లేదా ప్రాంతీయత ఉండేది కాదు. సిక్కులను ఊచకోత కోసి ఉండేది కాదు. కాశ్మీర్ నుండి వలసలు ఉండేవి కావు. మహిళలను కాల్చిచంపేవారు కాదు. సామాన్యులు కనీస సౌకర్యాల కోసం చాలా కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు, ”అనపి ప్రధాని మోదీ అన్నారు. ఫెడరలిజాన్ని ధ్వంసం చేశారంటూ కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించిన ప్రధాని.. రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిన చరిత్ర ఆ పార్టీకి ఉందని అన్నారు. అర్బన్ నక్సల్స్ భావజాలంలో కాంగ్రెస్ ఇరుక్కుపోయిందని ప్రధాని వ్యాఖ్యానించారు.