న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు చేపట్టింది. మే 13, 14, 15 తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ‘చింతన్ శిబిర్’ నిర్వహించేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేసింది. వరుస పరాజయాలతో దిగాలుపడ్డ పార్టీకి పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు నడుం బిగించింది. కాంగ్రెస్‌లో విస్తృతస్థాయి మేధోమథన కార్యక్రమమైన ‘చింతన్ శిబిర్’లో చర్చించేందుకు 6 అంశాలను అజెండాలో భాగం చేశారు. వాటిపై పత్రాలను సిద్ధం చేసి చర్చించేందుకు 6 ప్యానెళ్లను ఏర్పాటుచేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. వీటిలో రాజకీయాంశాలపై ఏర్పాటు చేసిన ప్యానెల్‌లో టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు లభించగా, సామాజిక న్యాయం, సాధికారత ప్యానెల్‌లో కొప్పుల రాజుకు చోటు దొరికింది. ఆ ప్యానెళ్ల వివరాలు
రాజకీయాంశాలు
- మల్లికార్జున ఖర్గే – కన్వీనర్
- గులాం నబీ ఆజాద్
- అశోక్ చవాన్
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- శశి థరూర్
- గౌరవ్ గగోయ్
- సప్తగిరి శంకర్ ఉలాకా
- పవన్ ఖేరా
- రాగిణి నాయక్
సామాజిక న్యాయం, సాధికారత
- సల్మాన్ ఖుర్షీద్ – కన్వీనర్
- మీరా కుమార్
- దిగ్విజయ్ సింగ్
- కుమారి షెల్జా
- సుఖ్జీందర్ సింగ్ రంధావా
- నబం తుకీ
- నరన్‌భాయ్ రత్వా
- ఆంటో ఆంటోనీ
- కొప్పుల రాజు
ఆర్థిక వ్యవస్థ
- పి. చిదంబరం – కన్వీనర్
- సిద్ధరామయ్య
- ఆనంద్ శర్మ
- సచిన్ పైలట్
- మనీష్ తివారి
- ప్రొఫెసర్ రాజీవ్ గౌడ
- ప్రణితి షిండే
- ప్రొఫెసర్ గౌరవ్ వల్లభ్
- సుప్రియ శ్రీనాటే
సంస్థాగత వ్యవహారాలు
- ముకుల్ వాస్నిక్ – కన్వీనర్
- అజయ్ మాకెన్
- తారిఖ్ అన్వర్
- రమేశ్ చెన్నితల
- రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా
- అధిర్ రంజన్ చౌదరి
- నెట్టా డిసౌజా
- మీనాక్షి నటరాజన్
రైతులు, వ్యవసాయం
- భూపిందర్ సింగ్ హుడా – కన్వీనర్
- టీఎస్ సింగ్‌దేవ్
- శక్తి సింహ్ గోహిల్
- నానా పటోలే
- ప్రతాప్ సింగ్ భజ్వా
- అరుణ్ యాదవ్
- అఖిలేశ్ ప్రసాద్ సింగ్
- గీతా కోరా
- అజయ్ కుమార్ లల్లూ
యువత – సాధికారత
- అమరీందర్ సింగ్ వర్రింగ్ – కన్వీనర్
- బీవీ శ్రీనివాస్
- నీరజ్ కుందన్
- కృష్ణ బైరెగౌడ
- కృష్ణ అల్లవారు
- అల్కా లాంబ
- రోజీ ఎం. జాన్
- అభిషేక్ దత్
- కరిష్మా ఠాకూర్
- డా. అంకిత దత్తా