Saturday, November 23, 2024

ఇండియా గేట్ దగ్గర నేతాజీ విగ్రహం ఏర్పాటు చేస్తాం: అమిత్ షా

నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశానికి చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందని, కానీ, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి భావి తరాలు స్ఫూర్తిపొందేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నెలకొల్పనున్నట్టు గతంలో మోడీ ప్రకటించారు. కాగా, ఆ విగ్రహ ఏర్పాటు పూర్తయ్యే దాకా ఆయన హాలోగ్రామ్ విగ్రహం అదే స్థలంలో ఉంటుందని చెప్పారు అమిత్ షా.

‘భారత స్వాతంత్ర్యం కోసం సర్వస్వం ధారపోసిన నేతాజీకి ఇది సముచితమైన నివాళి’ అని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.  “నేతాజీ భారతదేశం యొక్క నిజమైన శక్తి, సంకల్పానికి సారాంశం. నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఇండియా గేట్ వద్ద విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం మన తరాలకు స్ఫూర్తినిస్తుంది’’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. నేతాజీ 125వ జయంతి రోజైన ఆదివారం ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. అయితే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో బెంగాల్‌ ప్రభుత్వం ప్రదర్శనకు ఉంచే నేతాజీ శకటాన్ని అంగీకరించి ఉండాల్సింది అని అమిత్ షా అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement