కరోనా వ్యాక్సిన్‌పై వేసుకునే విషయంపై గందరగోళం నెలకొంది. తాజాగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) కేంద్రానికి కీలక సూచనలు చేసింది. కరోనా నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత టీకా తీసుకోవాలని, ప్రసవం తర్వాత ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చని పేర్కొంది. గర్భిణులు కూడా వారి ఇష్టం ప్రకారం వ్యాక్సిన్ వేయించుకోవచ్చంది. అయితే ప్రపంచమంతా కరోనా నుంచి కోలుకున్న 30 నుంచి 60 రోజుల్లోపు ఎప్పుడైనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని చెప్తుంటే మన దేశంలో మాత్రం NTAGI కొత్త వాదన తెరపైక తేవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొరతను కప్పిపుచ్చుకోవడానికే ఇదంతా చేస్తుందా అని పలువురు వైద్యులు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.
మరోవైపు కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచాలని కీలక సూచన చేసింది. ప్రస్తుతం కోవిషీల్డ్ మొదటి, రెండో డోసుల మధ్య వ్యవధి 6 నుంచి 8 వారాలుగా ఉంది. దాన్ని 12-16 వారాలకు పెంచాలని సూచించింది. కొవాగ్జిన్ మొదటి- రెండో డోసుల మధ్య వ్యవధిని మాత్రం యథావిధిగా ఉంచాలని తెలిపింది.