Friday, October 18, 2024

టీ.కాంగ్రెస్ లో భగ్గమన్న విభేదాలు.. వాళ్లని చచ్చిన వారితో పోల్చిన రేవంత్

హుజురాబాద్ ఫలితం తర్వాత టీ.కాంగ్రెస్ నేతలు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కొంపల్లిలో కాంగ్రెస్ నేతల శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరోమారు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ముందే రెండు వర్గాలు కొట్లాటకు దిగాయి. తమకు శిక్షణ తరగతుల పాసులు ఇవ్వలేదని ఆందోళన చేశాయి. జనగామ నియోజకవర్గ పరిధిలో మొదటి నుంచి పని చేస్తున్న వారికి పాసులు ఇవ్వలేదని ఆరోపించాయి.

జనగామలో పొన్నాల లక్ష్మయ్య వర్గానికి మాత్రమే పాసులు ఇచ్చి తమకు పాసుల ఇవ్వలేదని జంగారాఘవ రెడ్డి వర్గీయులు ఆందోళన చేశారు. పార్టీలో పనిచేసిన వారిని పక్కన బెట్టి.. కొత్తగా వచ్చిన వారికి పదవులు, ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆందోళనకారులకు రేవంత్ రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇష్టారాజ్యంగా ఎవరు చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణ మొదటి ప్రాధాన్యత అని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ శ్రేణులకు ఏవైనా సమస్యలు ఉంటే మండల, జిల్లా అధ్యక్షులకు చెప్పాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వీడిపోయిన వారు చచ్చిన వాళ్ళతో సమానమని రేవంత్ వ్యాఖ్యానించారు. సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మండల అధ్యక్షులకు రాహుల్ గాంధీ చేత సన్మానం చేయిస్తానని పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: మరో చారిత్రిక ఘట్టానికి శ్రీకారం.. ఒడిషా-ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సమావేశం

Advertisement

తాజా వార్తలు

Advertisement