Saturday, November 23, 2024

Live Update | రాష్ట్రపతి, ప్రధాని, ఒడిశా, తెలంగాణ సీఎంల సంతాపం

ఒడిశాలో ఇవ్వాల (శుక్రవారం) రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి కేంద్ర ప్రభుత్వ 10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది.  కాగా, ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు ముఖ్య నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

ఇక.. ఈ విషాదకరమైన రైల్వే ప్రమాదం గురించి తాను సమీక్షించానని, రేపు ఉదయం సంఘటనా స్థలాన్ని సందర్శిస్తానని ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్ తెలిపారు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇక తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి సత్వర వైద్య సేవలు అందించేందుకు వైమానిక దళం రంగంలోకి దిగింది. వారి ప్రాణాలు కాపాడే క్రమంలో సత్వరమే ఎయిర్​ లిఫ్ట్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement