2నెలల్లో షూటింగ్ పూర్తి..
థియేటర్ ల వద్ద 144సెక్షన్..
శతదినోత్సవంకి పోటెత్తిన ఫ్యాన్స్..
సూపర్ స్టార్ కృష్ణ……..ఈపేరు వినగానే మనకు గుర్తొచ్చేవి ఏంటంటే……తొలి తెలుగు జేమ్స్‌బాండ్ చిత్రం ‘గూఢచారి 116’ తొలి తెలుగు కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్ళకు మోసగాడు’ తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ని అందించిన సూపర్‌స్టార్ కృష్ణ తొలి తెలుగు 70 ఎం.ఎం 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్‌తో స్వీయ 1దర్శకత్వంలో నిర్మించిన ‘సింహాసనం’ *మార్చి 21న 1986 లో విడుదలై ఘనవిజయం సాధించడమే కాకుండా మొదటి వారం 1 కోటి 51 లక్షల 65 వేల 291 రూపాయలు కలెక్ట్ చేసి ఆల్‌టైమ్ స్టేట్ రికార్డ్ క్రియేట్ చేసింది. 3కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 5కోట్ల రూపాయలు వాసులు చేసింది. ఇలాంటి సినిమా ఇప్పుడు తీస్తే 3ఏళ్ళు టైమ్ తీసుకుంటుంది…. కాని అప్పట్లో కేవలం 2నెలల్లో సింహాసనం పూర్తి చేశారు. జానపద చిత్రాల్లోనే సరికొత్త ఒరవడిని సృష్టించిన ‘సింహాసనం’ ఓపెనింగ్స్ పరంగా ఆ రోజుల్లో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించడమే కాకుండా శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకుంది. చాలా థియోటర్స్ లో టిక్కట్ల కోసం తొక్కిసలాట జరిగితే 144 సెక్షన్ విధించారు. ఇక చెన్నైలో ‘సింహాసనం’ శతదినోత్సవం విజిపి గార్డెన్స్‌లో జరిగినప్పుడు కృష్ణ అభిమానులు వేల సంఖ్యలో తరలిరావడం తమిళనాడు ప్రభుత్వాన్ని సైతం ఆశ్చర్య పరిచింది. దాదాపు 400 బస్సుల్లో ఘట్టమనేని అభిమానులు చెన్నై రావడం పెద్ద చర్చనీయాంశం అయింది. పద్మాలయా స్టూడియోస్ బేనర్‌పై కృష్ణ కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తూ నిర్మించిన ‘సింహాసనం’ ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం కావడం విశేషం. బప్పీలహరి సంగీత దర్శకత్వం వహించిన ‘సింహాసనం’ సాంగ్స్ అన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఇప్పటికీ ‘ ఆకాశంలో ఒకతార నా కోస మొచ్చింది ఈవేళ’, ‘ వాహ్వా నీ యవ్వనం’, ‘ గుమ్మా గుమ్మా ముద్దుగుమ్మ’ పాటలు వినిపిస్తూనే వుంటాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..