రాజకీయాలకు తాను దూరమని హీరో మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. వైసీపీ నాకు రాజ్యసభ ఆఫర్ చేసిందనేది అవాస్తవమని చెప్పారు. నేను అలాంటి ఆఫర్లు కోరుకోనని స్పష్టం చేశారు. రాజకీయాలకు తాను దూరమని చిరంజీవి మరోసారి క్లారిటీ ఇచ్చారు. పదవులు ఆశించే వ్యక్తిని కాదన్నారు చిరంజీవి. రాజ్యసభ సీటు అనే మాట కేవలం ప్రచారమని తెలిపారు. అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కాగా నిన్న ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సినిమా టికెట్ల అంశంపై సీఎంతో చర్చించానని స్వయంగా చిరంజీవి వెల్లడించారు.
అయితే, చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. దీనిపై చిరంజీవి స్పందించారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యానని స్పష్టం చేశారు. కాగా, చిరంజీవి ఈ సాయంత్రం మళ్లీ ఏపీకి రానున్నారు. సాయంత్రం 5 గంటలకు కుటుంబ సమేతంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. డోకిపర్రులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే గోదాదేవి కల్యాణోత్సవానికి చిరంజీవి కుటుంబం హాజరయింది. కాగా ఎయిర్ పోర్ట్ లో రాజకీయాలపై స్పందించారు మెగాస్టార్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..