బోనాలపై సింగర్ మంగ్లీ పాడిన పాట వివాదం చెలరేగుతోంది. హైదరాబాద్‌లో సింగర్ మంగ్లీపై బీజేపీ కార్పొరేటర్లు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని, సామాజిక మాధ్యమాల నుంచి పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. మంగ్లీపై కేసు నమోదు చేయాలని బీజేపీ కార్పొరేటర్లు సీపీని కోరారు.
తెలంగాణలో పండుగల సందర్భంగా మంగ్లీ పాడిన ప్రత్యేక గీతాలు విడుదల అవుతూ ఉంటాయి. ఈ నెల 11న మంగ్లీ పాడిన బోనాల పాట విడుదల అయింది. ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ‘’చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క ఓ మైసమ్మా’’అంటూ ఈ పాట సాగుతూ ఉంటుంది. అయితే ఈ పాట లిరిక్స్ హిందూ దేవతలను కించపరిచేలా ఉందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మరోవైపు ఈ వివాదంపై మంగ్లీ స్పందించారు. పాట వివాదంపై ప్రకటన విడుదల చేశారు. పాటపై విమర్శలు వచ్చిన రోజేనే మార్చేశామని తెలిపారు. గ్రామదేవతను ఎలా పూజిస్తారో తెలుసుకుని విమర్శిస్తే మంచిదని మంగ్లీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: సింగరేణిలో ఎన్నికల వేడి!