Tuesday, November 26, 2024

కేటీఆర్, సంతోష్‌కుమార్‌లపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

తెలంగాణ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ లపై మానవహక్కులకు ఫిర్యాదు అందింది. ఉన్నత అధికారులు కల్వకుంట్ల కుంటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అంగన్వాడీ ఉద్యోగిలను ఎండలో నిలబెట్టి దండాలు పెట్టించారని ఫిర్యాదులో ఆరోపించారు. నారాయణపేట పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ రావు మహబూబ్ నగర్ లో స్వాగతం పలుకడానికి గంటలకొద్ది వరుసల్లో నిలబెట్టి తమ నియంత్రత్వ పోకడాలను తలపిస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వనికి ఉద్యోగులను ఈ విధంగా హింసించడం సర్వ సాధారనం అయిందన్నారు. మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, కలెక్టర్, అధికారులపై ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారికి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఎంపీ సంతోష్‌‌‌‌‌‌‌‌కు స్వాగతం.. రెండు వేల మంది మహిళలతో దండాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement