వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అసెంబ్లీ సమావేశాలు పుర్తయిన అనంతరం ఉభయగోదావరి జిల్లాల్లో మంత్రి పర్యటించారు. సీఎం జగన్ రైతులని ప్రతి కష్టంలో ఆదుకుంటున్నారని తెలిపారు. తాడేపల్లిగూడెం , తణుకు , ఆచంట నియోజక వర్గాల్లో సహచర మంత్రి రంగనాధ రాజు ఇతర శాసన సభ్యులతో సహా పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు.పంట నష్టం అంచనాలు పారదర్శకంగా చేసి త్వరలోనే నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలంలో బి కొండెపాడు గ్రామంలో పొలాల్లోకి దిగి మంత్రి కన్నబాబు పంటనష్టాన్ని అంచనా వేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు, తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించి అకాల వర్షాలు వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు. రైతులకు ఎక్కడా నష్టం జరగకుండా చూస్తామని మంత్రులు ధైర్యం చెప్పారు. ఆచంట నియోజకవర్గంలోని నత్తా, రామేశ్వరం, పెనుమంట్ర, బ్రాహ్మణ చెరువు తదితర గ్రామాల్లో మంత్రులు , ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..