Sunday, November 24, 2024

ఆర్టీసీలో త్వ‌ర‌లోనే కారుణ్య నియామ‌కాలు – మంత్రి పేర్ని నాని

విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన 1800మంది కుటుంబాల‌కు ఆర్టీసీతో పాటు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ఉద్యోగం క‌ల్పించ‌నున్నామ‌ని తెలిపారు మంత్రి పేర్ని నాని. కాగా ఏపీ ఆర్టీసీలో త్వ‌ర‌లోనే కారుణ్య నియామ‌కాలు చేప‌డ‌తామ‌న్నారు. ఏపీ సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఆర్టీసీ ఉద్యోగులకు కారుణ్య నియామకాల కింద 45 ప్రభుత్వ శాఖలో భర్తీ చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. వీరికి సంబంధిత జిల్లాల్లోనే ఉద్యోగం కల్పించాలని ఆదేశాలు కలెక్టర్లకు అందినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఆర్టీసీకి నష్టం వస్తుందన్నారు. ఏపీలో ఆర్టీసీ బస్సులకు బయట బంకుల్లోనే డీజిల్‌ కొంటున్నామన్నారు. కేంద్ర బంకుల్లో కంటే బయట బంకుల మధ్య డీజిల్‌ ధర లీటర్‌కు 22 రూపాయల వ్యత్యాసం ఉంటుందన్నారు. రోజుకు ఏపీలో ఆర్టీసీ బస్సులకు 8లక్షల లీటర్ల ఆయిల్‌ కొనుగోలు వల్ల రోజుకు కోటిన్నర భారం తగ్గుతుందని అన్నారు.రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ బస్సుల టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, సుమారు 40 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రభుత్వానికి అందనుందని వివరించారు. రాష్ట్రంలో 60 ఏండ్ల పైబడిన ప్రయాణికులకు 25 శాతం రాయితీని ఏప్రిల్‌ 1 నుంచి పునరుద్ధరిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement