హైదరాబాద్, ప్రభన్యూస్ : ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో సంస్థలో మార్పులు తీసుకు వచ్చిన సజ్జనార్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రయాణికులకు రవాణా సేవలను అందించడంతో పాటు సామాజిక సేవలోనూ సంస్థ ఉద్యోగులు వెనక్కుతగ్గరని నిరూపించేందుకు సన్నద్దమయ్యారు. ఈ నెల 30 వ తేదీన రాష్ట్రంలో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సంస్థ సిబ్బంది నుంచి అధికారుల వరకు, స్నేహితుల నుంచి కుటుంబ సభ్యుల వరకు ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఎండీ కోరారు. ఉదయం గం. 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మెగా రక్తదాన శిబిరం ఉంటుందని పేర్కొన్నారు.
అన్ని రీజియన్ల నుంచి 65 చోట్ల ఈ శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాణా పాయంలో ఉన్న వారిని ఆదు కునేందుకు ఆరోగ్యవంతులైన ఉద్యోగులందరూ రక్తదా నం చేసేందుకు ముందుకు రావాలని సజ్జనార్ పిలుపు నిచ్చారు. తలసేమి యా, క్యాన్సర్ వ్యాధి గ్రస్తులు, గర్భిణీల కోసం రక్త సేకరణ కార్యక్రమాన్ని అన్ని డిపోలు, వర్క్ షాప్‌లు, బస్‌భవన్‌తో బస్టేషన్లలోనూ నిర్వహిస్తు న్నట్లు వెల్లడించారు. సాధా రణంగా ఆరోగ్యంగా ఉన్న వారు ఏటా రెండు, మూడు సార్లు రక్తదానం చేయో చ్చని, రక్తదానం చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలుం టాయన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital