2022లో నేను నటించేది ఆఖరి చిత్రం అని ..ఇకపై సినిమాల్లో నటించబోనని తెలిపారు కమెడియన్. నటుడు రాహుల్ రామకృష్ణ. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నేను పట్టించుకునేది కాదు, ఎవరూ పట్టించుకోకూడదన్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు రాహుల్ రామకృష్ణ . ఆ తర్వాత.. పెళ్లి చూపులు.. జాతిరత్నాలు వంటి సినిమాలతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. కమెడియన్గా.. నటుడిగా రాణిస్తూ మంచి ఫాంలో దూసుకుపోతున్న తరుణంలో రాహుల్ రామకృష్ణ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.
ఇక పై తాను సినిమాల్లో నటించనని తెలిపారు. 2022 వరకు మాత్రమే తాను సినిమాల్లో నటిస్తానని.. ఆ తర్వాత నటనకు దూరం అవుతానని రాహుల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. దీంతో రాహుల్ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆకస్మాత్తుగా రాహుల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నాడా అంటున్నారు పలువురు నెటిజన్స్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..