తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు సెలబ్రేట్ చేసుకుందాం.. మీరు తప్పకుండా రావాలి అని సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం, తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్‌కు ఆహ్వానం పంపారు. ఇప్పటిక సీఎం రేవంత్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం ఈసీ నుంచి అనుమతి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఆవిర్భావ వేడుకలు వారికి తొలిసారి కావడంతో రేవంత్ సర్కారు ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా, సీఎం రేవంత్ తనదైన మార్కు చూపించాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా.. తెలంగాణను ఇచ్చిన తల్లిగా.. సోనియమ్మను ఈ ఉత్సవాలను రావాల్సిందిగా ఢిల్లీకి వెళ్లి ఆహ్వానించారు. సోనియాతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్లను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా… తెలంగాణ రాష్ట్రగేయం, లోగోలను తిరిగి కొత్తగా ఆవిష్కరణకు అన్నిరకాల ఏర్పాట్లు జరిగాయి. కానీ, లోగో విషయంలో మరిన్ని సలహాలు, సూచనలు రావడంతో దాన్ని వాయిదా వేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. కానీ, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ ఫైనల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ రోజైన జూన్ 2 న గీతాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రగీతం రాసిన అందెశ్రీ , స్వరం అందించిన కీరవాణిని ఆవిర్భావ ఉత్సవాల రోజున ఘనంగా సన్మానించినున్నట్లు తెలుస్తోంది.
ఇక.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్ గులాబీబాస్ కేసీఆర్‌కు లేఖ కూడా పంపినట్టు సమాచారం. ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా ఆయన నివాసానికి వెళ్లి, లేఖను అందించాలని ఆయన సలహాదారు హర్కర్ వేణు గోపాల్‌ను ఆదేశించారు. కేసీఆర్ నివాసానికి వెళ్లి, తాను ప్రత్యేకంగా చెప్పానని.. ఈ విషయం తెలియజేయాలని సూచించారు.