కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు శశిథరూర్ పార్టీ ప్రతినిధులకు తన ఆఖరి రిక్వెస్ట్‌ని ట్వీట్టర్ ద్వారా చేరవేశారు. మన పని విధానంలో మార్పు తీసుకురావడానికి గత అనుభవాలకు తోడు.. కొత్త శక్తితో ముందుకు నడుద్దాం అని ట్విట్టర్లో పేర్కొన్నారు. రేపు తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
‘‘మీరు ఇప్పటికే నా ఎన్నికల మేనిఫెస్టోను చూశారని భావిస్తున్నా. వికేంద్రీకరణ, అందరినీ కలుపుకొని పోవాలనే నా సందేశం మీ అందరికీ నచ్చి ఉండవచ్చని అనుకుంటున్నా.. అయితే మీలో కొందరు ఇప్పటికీ మార్పు ఆలోచన గురించి వెనకాడుతున్నట్టు అవగతం అవుతోంది.’’ అని ట్విట్టర్లో తెలిపారు శశిథరూర్.
ఇక.. సమయం, పరిస్థితికి తగ్గట్టు పార్టీలో మార్పులు జరగాలని తాను భావిస్తున్నా అన్నారు. ఈ మార్పులు పార్టీని బలోపేతం చేస్తాయని అనుకుంటున్నాని పేర్కొన్నారు. గత అనుభవాలను కొత్త శక్తితో కలిపి మార్పు తీసుకువద్దామని సూచించారు. కాంగ్రెస్ ప్రతినిధులంతా తమ మద్దతును తెలియజేస్తూ తన పేరు ముందు ‘టిక్’ మార్క్ పెట్టాలని కోరారు. ప్రతినిధులారా దయచేసి గమనించండి .. నా పేరు పక్కన ఉన్న బాక్స్‌లో టిక్ మార్క్ పెట్టి నాకు సపోర్ట్ చేయండి అని ట్విట్టర్లో కోరారు శశిథరూర్. అక్టోబర్ 17న ఎన్నికలు జరగనుండగా.. ఇంతకుముందు నవంబర్ 2000 సంవత్సరంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఇందులో పార్టీ ముఖ్య నేత సోనియా గాంధీ తన ప్రత్యర్థి జితేంద్ర ప్రసాదపై గెలుపొందారు.