Friday, November 22, 2024

ప్రిన్సిపాల్ ని కొట్టిన ప్రొఫెస‌ర్ – అరెస్ట్ చేసిన పోలీసులు

క‌ళాశాల ప్రిన్సిపాల్ ని దారుణంగా కొట్టాడు. కొట్టింది ఎవ‌రో బ‌య‌ట వ్య‌క్తి కాదులెండి. కాలేజీలో ప్రొఫెస‌ర్ ఈ దారుణానికి ఒడి గ‌ట్టాడు. కాగా ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఉజ్జ‌యినిలో చోటు చేసుకుంది. ఈ వీడియోని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో వైర‌ల్ గా మారింది. ప్రిన్సిపాల్ ని అస‌భ్య‌క‌ర‌మైన మాట‌లు మాట్లాడ‌ట‌మే కాదు, గాయ‌ప‌రిచాడు కూడా. దాంతో ప్రొఫెస‌ర్ పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. కరోనా నేపథ్యంలో.. అందరికీ ఆ కాలేజీలో.. వ్యాక్సిన్ పంపకాలు మొదలుపెట్టారు. కాగా.. ఈ విషయం గురించి మాట్లాడదామని తాను ప్రొఫెసర్ ని తన గదికి పిలిచానని.. దానికే.. అతను తనతో గొడవపడి.. దాడి చేశాడని ప్రిన్సిపల్ తెలిపారు. ప్రిన్సిపాల్ గదిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం పెద్దదిగా మారింది. కోపంతో ముందు ప్రొఫెసర్ తన కుర్చీలో నుంచి లేచి మరీ.. ప్రిన్సిపల్ ని కొట్టాడు. ఆ తర్వాత… టేబుల్ మీద ఉన్న వస్తువులన్నింటినీ తీసుకొని.. అతనిపై విసిరేయడం మొదలుపెట్టాడు. గొడవ మొత్తం బయటకు వినపడటంతో.. ఎవరో ఐదుగురు లోపలికి వచ్చి.. గొడవను అదుపు చేశారు. ప్రొఫెసర్ ఇంకా కోపంతో, ప్రిన్సిపాల్‌పై అరుస్తూనే ఉన్నాడు. ఆకస్మిక దాడి నుండి కోలుకున్న ప్రిన్సిపాల్ .. ప్రొఫెసర్‌కి సైగలు చేసి, గది నుండి బయటకు వెళ్లమని అడిగాడు, కానీ అతను వెళ్ళడానికి నిరాకరించి తన కుర్చీలో కూర్చున్నాడు. ఈ మేర‌కు ప్రొఫెస‌ర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement