Saturday, November 23, 2024

Breaking: బీజేపీ లీడ‌ర్‌ గ‌న్ లైసెన్స్‌ ర‌ద్దు చేస్తూ కలెక్టర్​ ఉత్తర్వులు.. ఎందుకంటే..

తెలంగాణ రాష్ట్రంలోని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా బీజేపీ సెక్ర‌ట‌రీగా కొన‌సాగుతోన్న రెడ్డ‌బోయిన గోపీకి పోలీసులు షాకిచ్చారు. గోపీ తుపాకీ లైసెన్స్‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిపేట‌లో శుక్ర‌వారం రాత్రి బీజేపీ, టీఆర్ఎస్ నాయ‌కుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌లెత్తెంది. ఈ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న గోపీ తుపాకీ క‌న‌బ‌డింది. ఈ క్ర‌మంలో గోపీపై ఎల్లారెడ్డిపేట పోలీసు స్టేష‌న్‌లో రెండు కేసులు న‌మోదు అయ్యాయి.

ఈ ప‌రిణామాల మ‌ధ్య గోపీ తుపాకీ లైసెన్స్‌ను ర‌ద్దు చేస్తూ క‌లెక్ట‌ర్ అనురాగ్ జ‌యంతి శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. గోపీపై 143, 341, 353 r/w 34 IPC సెక్ష‌న్ల‌తో పాటు 307, 448, 148 r/w 149 IPC సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement