ఒమిక్రాన్ ఎంతగా వ్యాప్తి చెందినా హాస్పటల్ లో జాయిన్ అయిన కేసులు తక్కువేనని వైద్య నిపుణులు వెల్లడించారు. మూడు నాలుగు రోజుల్లోనే కోలుకుంటుడటంతో వారం రోజుల్లోనే ఆఫీసుల బాట పడుతున్నారు. కానీ ఒమిక్రాన్ తగ్గిపోయినా పలు లక్షణాలు మాత్రం తీవ్రంగా వేధిస్తున్నాయని వైద్య నిపుణులు వెల్లడించారు. ఒమిక్రాన్ తగ్గాక జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు తగ్గుముఖం పట్టినా.. దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం తీవ్రంగా ఉంటున్నాయని అంటున్నారు. దగ్గు తగ్గకపోతే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మామూలు మందులు వాడితే సరిపోతుందని సూచిస్తున్నారు. వారంలో తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. చాలా వరకు ఒమిక్రాన్ గొంతువరకే పరిమితమవుతోందని, ఆరంభంలోనే గుర్తిస్తే ఊపిరితిత్తుల దాకా వెళ్లకుండా అడ్డుకోవచ్చని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..