కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపం, వేడి గాలులు, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. కర్నాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, ఈ నెల 25 వరకు దాని ప్రభావం తెలంగాణపై ఉంటుందని వెల్లడింది.
దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో నిన్న సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిన విషయం తెలిసిందే. సీటీ వ్యాప్తంగా వాన కురింది. కాగా, ఇవ్వాల (శుక్రవారం) ఇప్పటికే నగరం మొత్తం మేఘావృతమై ఉన్నది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.