Monday, November 11, 2024

సివిల్‌ సప్లయీస్ లో కోల్డ్ వార్.. మంత్రి వర్సెస్‌ చైర్మన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో మంత్రి వర్సెస్‌ చైర్మన్‌ అన్నట్టుగా వ్యవహారం సాగుతుందా? మినిస్టర్‌, చైర్మన్‌ ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఇరువురి మధ్య పొసగకపోవడంతో శాఖలో కీలక నిర్ణయాలు తీసు కోవడంలో సమస్యలు ఏర్పడుతున్నాయన్న వాదన వినబడు తోంది. మం త్రి, చైర్మన్‌ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఉన్నతాధి కారుల నుంచి, జిల్లా అధికారుల వరకు నిర్ణయాల విషయంలో జాప్యం జరగడంతో పాటు క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి ఆటంకాలు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. కొనుగోళ్ల అంశం లోనూ ఇరువురూ కలిసి సమీక్షలు నిర్వహిం చిన దాఖలాలు లేవని తెలుస్తుండగా.. కలిసి పాల్గొన్న సమీక్షల్లో తీసుకున్న నిర్ణయాల్లోనూ స్పష్టత లేకుండా ఉంటున్నదని తెలుస్తోంది.

గత యాసంగి సీజన్‌లో కొనుగోలు జరిపిన ధాన్యంలో కోట్ల రూపాయల గోల్‌మాల్‌ జరిగిందని రైతులు వినతులు ఇచ్చి, ఆందోళనలు జరిపినా.. ఆయా మిల్లులపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. కొన్ని చోట్ల బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న మిల్లులకూ ధాన్యం వెళ్లడంపై విమర్శలొచ్చాయి. ఇదంతా మంత్రి, చైర్మన్‌ మధ్య సఖ్యత లేకపోవడంతో పాటు వర్గాలు ఉండడం వలన కూడా మిల్లర్లతో పాటు తదితర అంశాలపై అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది.

నేతల మధ్య పొరపచ్చాలు.?
మంత్రి, చైర్మన్‌కు మధ్య పొసగకపోవడానికి పలు అంశాలు కారణమని తెలుస్తుంది. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా విడుదల చేస్తున్న నిధుల వినియోగం అనంతరం వాటిని తీర్చే క్రమంలో చూపిస్తున్న వడ్డీలు కారణమని తెలుస్తోంది. వాస్తవానికి చైర్మన్‌కు సివిల్‌ సప్లయ్‌లో కొనుగోలు తప్ప.. మిగతా అంశాల్లో పెద్దగా పరిమి తులు లేవు, కానీ అంతా తానై నడిపించడంతో కూడా ఇద్దరి మధ్య పొరపచ్చాలకు దారితీసిందన్న గుసగుసలు వినబడు తున్నాయి. గన్నీ సంచుల సేకరణ అంశంలోనూ డబ్బుల పంపిణీ అంశంపై భిన్న స్వరాలు వినిపిస్తుండడం కూడా మంత్రికి నచ్చకపోవడంతో శాఖపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. యాసంగి ధాన్యం కొనుగోళ్ల తరువాత రైతుల ఖాతాల్లో జమ అయ్యే నగదు విషయం కూడా కొందరి కనుసన్నల్లో జరిగిందని, ఇందులో సొసైటీల పాత్ర కూడా ఉందని తెలుస్తోంది.

- Advertisement -

ఈ కారణం చేతనే ఆరోపణలు వచ్చిన మిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న వాదన వినబడుతోంది. గతంలో జరిగిన కార్పోరేషన్‌ నిధుల రిలీజ్‌, 2016-17లో కందులు కొనుగోలు, మిల్లుల కేటాయింపు, అనంతరం ఆగమయ్యా యన్న పేరిట డిస్పోజల్‌ విషయంలోనూ కొంత అనుమానాలు వ్యక్తమవు తున్నాయని సమాచారం. దీంతోపాటు శాఖలో చైర్మనే అన్నీ తానై వ్యవహరించడంతో పాటు కమిషనర్‌పై కూడా పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణ వస్తున్నది. ఇదే సమయంలో కమిషనర్‌ కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఈ కారణాల నేపథ్యంలోనే మంత్రి శాఖపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడంలేదని తెలుస్తోంది.
పరిష్కారం కాని రేషన్‌ డీలర్ల సమస్య..
రేషన్‌ డీలర్ల కమీషన్‌ పెంపు అంశంపై స్పందిస్తూ స్వయంగా సీఎం కేసీఆరే అసెంబ్లిdలో కమీషన్‌ పెంచుతామని ప్రకటించినా మంత్రి, చైర్మన్‌ మధ్య సఖ్యత లేకపోవడం, ఏకాభి ప్రాయా నికి రాకపోవడంతో ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం వెలువరచలేదు. ప్రస్తుతం క్వింటా బియ్యానికి రూ.70 కమీషన్‌ ఇస్తుండ గా, దాన్ని రూ.200కు పెంచాలని రేషన్‌ డీలర్లు ప్రభుత్వాన్ని కోరారు.

సమస్యల పరిష్కారానికి ఎవరి దగ్గరికి వెళ్లాలి?
ఒకవైపు మిల్లర్లు, మరో వైపు రేషన్‌ డీలర్లు.. క్షేత్రస్థాయిలో కొనుగోళ్లలో ఏర్పడే సమస్యలపై ఇరువురిలో ఎవరి దగ్గరికి వెళ్లాలి, ఎటు వెళితే ఎలాంటి స్పందన వస్తుందోనని మిల్లర్లు, రేషన్‌ డీలర్లు, అధికారులు అయోమయంలో ఉన్నారు. దీంతో సమస్య పరిష్కారానికి సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం నూతన రేషన్‌ కార్డులను ఇవ్వగా వీటి జారీలోనూ క్షేత్రస్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కొంత నష్టం జరిగిందని తెలుస్తోంది. రేషన్‌ కార్డుల జారీపై కూడా సరైన స్పష్టత లేకుండా వ్యవహరించారని సమాచారం. ఇరువురూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తుండడంతో ఈ కారణాలకు బలం చేకూరుతుందని వినికిడి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement