హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహిస్తున్న ముఠాని హైదరాబాద్ పోలీసులు ఇవ్వాల రాత్రి పట్టుకున్నారు. 70 మందితో కలిసి పెద్ద ఎత్తున బెట్టింగ్ పెట్టి కోడి పందేలు నిర్వహిస్తుంటే కచ్చితమైన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 49 మంది పరారు కాగా, 21 మంది పట్టుబడ్డారు. వీరిలో టీడీపీ మాజీ ఎమ్మేల్యే చింతమనేని ప్రభాకర్ సహా పలువురు విఐపీలున్నట్టు తెలుస్తోంది.
లక్షల్లో బెట్టింగ్ పెట్టి కోడిపందాలు ఆడుతున్నగ్యాంగ్‌ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల అదుపులో 20మందికి పైగా బెట్టింగ్ రాయుళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. పరారైన వారికోసం పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. కాగా, పోలీసులను చూసి చింతమనేని పరారైనట్టు తెలుస్తోంది. పటాన్ చెరు డీఎస్పీ భీం రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిందితుల నుంచి భారీగా నగదు, కోళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
పెదకంజర్ల గ్రామంలోని ఓ తోటలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారు. కోంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేత చింతమనేని కోడిపందాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పోలీసుల దాడిలో నిందితుల నుంచి 13.12లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 21మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి చెందిన 26 వాహనాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 32 పందెం కోళ్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.