ముంబై పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.502కోట్ల విలువైన కొకైన్ ను సీజ్ చేశారు. సౌతాఫ్రికా నుంచి సముద్రమార్గం ద్వారా ముంబై పోర్టుకు కంటైనర్ లో తరలించారు. కేటుగాళ్లు గ్రీన్ యాపిల్స్ ముసుగులో డ్రగ్స్ తరలిస్తున్నారు. ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు కేసు నమోదు చేశారు. ముంబైకి పార్శిల్ ఎవరు పంపారనే దానిపై డీఆర్ఐ ఆరా తీస్తోంది.
దక్షిణాఫ్రికా నుండి వచ్చిన గ్రీన్ యాపిల్స్ సరుకు నుండి 198 కిలోల మెత్ మరియు 9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న కేసులో డిఆర్‌ఐ అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద డిఆర్‌ఐ అధికారులు దిగుమతిదారుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.