Tuesday, November 26, 2024

కోస్తా, గోదావరి జిల్లాలలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఏపీలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఎండలు మండిపోతున్నాయి. రెండు వారాలుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలో ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా నమోదవుతున్నాయి. ఎండకు తోడు ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని 15 మండలాల్లో మంగళవారం నుంచి వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం ప్ర‌క‌టించింది. సోమ‌వారం విశాఖలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా… వడ‌గాలులు పెరుగుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. దీంతో సాధార‌ణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా న‌మోద‌వుతాయ‌ని అంచ‌నా వేసింది. ఇక తూ.గోదావ‌రి జిల్లాలో 38 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోద‌వ‌గా, రెండ్రోజుల్లో 40 డిగ్రీలకు చేరుకుంటుంద‌ని అధికారులంటున్నారు. కొన్ని జిల్లాల్లో 30 డిగ్రీల ప‌గ‌టిపూట ఉష్ణోగ్ర‌త‌లు ఉన్నా… రాత్రిపూట చ‌లిగా ఉంటుంది.

కానీ రెండు వారాల్లో ఏపీలోని ప్ర‌తి జిల్లాలో 40 డిగ్రీల‌కు పైగా న‌మోద‌వుతాయ‌ని, కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్ర‌త‌తో పాటు వ‌డ‌గాలుల ప్ర‌భావం ఉంటుంద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement