Friday, November 22, 2024

షూటింగ్స్ హ‌బ్ గా ‘విశాఖ‌తీరం’

షూటింగ్ ల‌తో సంద‌డిగా మారుతోంది విశాఖ తీరం. కాగా నిన్న సీఎం జ‌గ‌న్ తో టాలీవుడ్ ప్ర‌ముఖులు సినీ ప‌రిశ్ర‌మ‌లోని ప‌లు స‌మస్య‌లు వినిపించేందుకు భేటీ అయ్యారు. ఈ భేటీలో సినీ ప‌రిశ్ర‌మ వైజాగ్ కి త‌ర‌లిరావాల‌ని జ‌గ‌న్ పిలుపు నిచ్చిన సంగ‌తి తెలిసిందే. షూటింగ్స్ హ‌బ్ గా మారుతోంది విశాఖ తీరం. విశాఖలో సినిమా షూటింగ్‌ సందడి తిరిగి మొదలైంది. కోవిడ్‌ నిబంధనలు సడలించడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆర్టిస్టులు కూడా విశాఖ చేరుకుంటున్నారు. విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన తరువాత జోష్‌ ఎక్కువగా కనిపిస్తోంది. విశాఖ నగరం అంటే ప్రకృతి అందాలకు నెలవు. సముద్రానికి పచ్చని కొండలు తోడవడంతో పర్యాటకులతో పాటు సినిమా షూటింగులో కూడా అనువైన ప్రాంతంగా మారింది.1971 ప్రాంతంలో ప్రముఖ దర్శకుడు బాలచందర్‌ సినీ ఫ్రేమ్‌లో విశాఖను ఆవిష్కరించడంతో నగర అందాలు బయట ప్రపంచానికి తెలిశాయి. యారాడ, అప్పికొండ, ఆర్కే బీచ్, రుషికొండ, తొట్లకొండ, భీమిలి ఇలా భిన్నమైన ప్రకృతి అందాలతో కూడిన ఈ ప్రదేశాలు షూటింగ్‌ సీన్స్‌ సినిమాల్లో ప్రత్యేకతను చాటుతున్నాయి.

ఇక సింహాచలం కొండ సెంటిమెంట్‌గా మారడంతో చాలా మంది నటులు కొన్ని సీన్లు అక్కడ తీయాలని పట్టుబడుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఇక మెగాస్టార్‌ చిరంజీవికి కొత్త కేరీర్‌ విశాఖ ఇచ్చింది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రస్తుతం ఈ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సినిమా షూటింగ్‌ సందడి కనపడుతోంది. షార్ట్‌ ఫిల్మ్‌ల నుంచి భారీ బడ్జెట్‌ చిత్రాలవరకు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఫొటో షూట్‌లు, వెడ్డింగ్‌ షూట్స్, షార్ట్‌ ఫిల్మ్స్,వెబ్‌ సిరీస్‌ , టివి సీరియల్స్, డాక్యుమెంటరీల చిత్రీకరణతో నిత్యం ఈ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. విశాఖ తీరంలో షూటింగ్‌ జరిపితే కచ్చితంగా హిట్‌ అన్న సెంట్‌మెంట్‌ బలంగా ఉండడంతో దర్శక నిర్మాతలు భీమిలికి క్యూ కడుతున్నారు. భీమిలి బీచ్‌ నుంచి యారాడ బీచ్‌ వరకు నిత్యం ఎన్నో షూటింగ్‌లు ప్రస్తుతం జరుపుకుంటున్నాయి. ఇందులో ఎక్కువ శాతం ఆర్‌కే బీచ్, రుషికొండ బీచ్, మంగమారిపేట, ఎర్రమట్టి దిబ్బలు, రామానాయుడు స్టూడియో, భీమిలి బీచ్‌లలో చిత్రీకరణలు ఎక్కువ కొనసాగుతున్నాయి. కొండ కోన‌ల‌తో పాటు స‌ముద్ర‌తీరం ఉండ‌టంతో విశాఖ‌లో షూటింగ్ లు చేసేందుకు ప‌లువురు ద‌ర్శ‌కులు ఆస‌క్తిని చూపుతున్నార‌ట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement