Tuesday, November 26, 2024

పోలవరాన్ని పరిశీలించిన సీఎం.. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం

పోలవరం ప్రాజెక్ట్ పనులు ప్రభుత్వ గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా సీఎం జగన్‌.. ప్రాజెక్టను పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. పోలవరం ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి సీఎం స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

అనంతరం సీఎం జగన్‌  పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్‌ను సీఎం వైఎస్ జగన్‌ పరిశీలించి, అనంతరం పోలవరం పనుల ఫొటో గ్యాలరీని వీక్షించారు. గడువులోగా పోలవరం పనులు పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం పనుల పురోగతిపై అధికారులతో సీఎం జగన్ జరిపిన సమీక్షలో స్పిల్‌వే 42 గేట్లు అమర్చినట్టు తెలిపిన అధికారులు.. ఎగువ కాఫర్‌ డ్యాం పనులను పూర్తి చేశామని తెలిపారు. అదే సమయంలో దిగువ కాఫర్ డ్యాం పనుల పరిస్థితిని అధికారులు వివరించగా, 2022 జూన్‌ కల్లా రెండు కాల్వలకు లింక్ పనులు పూర్తి కావాలని, టన్నెల్, లైనింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం జగన్‌ సూచించారు. 2023 ఖరీఫ్‌ సీజన్‌కల్లా ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పూర్తి చేయాలని అధికారులతో సమీక్షలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement