Sunday, November 17, 2024

Oxygen Plants: ఏపీలో 144 ఆక్సిజన్ ప్లాంట్లు.. థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధం

దేశంలో కరోనా మరోసారి పగడ విప్పింది. రోజువారీ కేసులు రెండు లక్షలకు చేరువ అవుతున్నాయి. దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చిందని, జనవరి చివరి నాటికి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.  కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలు ఆక్సిజన్ కోసం విలవిలలాడారు. ఆక్సిజన్ లభించక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. థర్డ్ వేవ్ హెచ్చరికతో ఏపీ సర్కార్ ముందే అప్రమత్తమైంది. ఆక్సిజన్ కొరత థర్డ్‌వేవ్‌లో లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది.

భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రాణ వాయువు లేకుండా ఉండేలా జగనన్న ప్రాణవాయువు కార్యక్రమం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం జరగనుంది. రూ. 426 కోట్ల వ్యయంతో ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ. 20 కోట్ల వ్యయంతో ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ కంటైనర్లను కొనుగోలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్‌ పైప్‌లైన్లు సౌకర్యం కల్పిస్తారు. మొత్తం 39 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటు చేశారు. కోవిడ్‌తో పాటు ఇతర చికిత్సలకు 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్‌ వైరల్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement