Friday, November 22, 2024

సీఎం మార్పు ఉండ‌బోదు – య‌డ్యూర‌ప్ప‌

నాయ‌క‌త్వ మార్పు లేద‌ని స్ప‌ష్టం చేశారు బిజెపి క‌ర్ణాట‌క అగ్ర‌నేత య‌డ్యూర‌ప్ప‌. ప్ర‌స్తుత సీఎం బ‌స్వ‌రాజు బొమ్మె ప‌నితీరు ప్ర‌శంస‌నీయం అన్నారు. త‌న‌కు తెలిసినంత వ‌ర‌కు రాష్ట్రంలో సీఎం మార్పు ఉండ‌బోద‌న్నారు. బొమ్మై స్థానంలో నూత‌న వ్య‌క్తికి నాయ‌క‌త్వ బాధ్య‌తలు అప్ప‌గించ‌నున్న‌ట్టు భారీ ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. బెంగ‌ళూరులోని బ‌స‌వేశ్వ‌ర స‌ర్కిల్‌లో 12వ శ‌తాబ్ది క‌వి- లింగాయ‌త్ సాధువు బ‌స‌వ‌న్న విగ్ర‌హాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆవిష్క‌రించిన‌ప్ప‌టి నుంచి ఈ చ‌ర్చ మ‌రింత ఊపు అందుకుంది. బీజేపీ ఇటీవల ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాల అగ్ర నాయకత్వంలో మార్పులు చేసింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్ర‌జల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టడంలో విఫ‌లం అయ్యార‌న్న అభిప్రాయం మేర‌కు ముఖ్యమంత్రులను మార్చివేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు జరిగాయి, ఇందులో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. గుజరాత్‌లో ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరగనున్నాయి. గ‌తేడాది బీఎస్ యెడియూర‌ప్ప స్థానంలో బ‌సవ‌రాజు బొమ్మై.. క‌ర్ణాట‌క సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయితే.. పార్టీ అనుభవజ్ఞుడు య‌డ్యూ రప్ప ఆ ప్ర‌భుత్వానికి మెంటర్ స్థానంలో ఉన్నారు. నాటి నుంచి బొమ్మై స‌ర్కార్ ప‌లు వివాదాల్లో చిక్కుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement