Friday, November 22, 2024

అమిత్ షాకు సీఎం స్టాలిన్ లేఖ

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. గుజరాత్‌కు చెందిన అమూల్‌ను తక్షణమే దక్షిణాది రాష్ట్రంలో పాల సేకరణ నుండి విరమించుకునేలా ఆదేశించాలని సీఎం స్టాలిన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. తమిళనాడు మిల్క్ షెడ్ ప్రాంతంలో కైరా జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ (అమూల్) ద్వారా పాల సేకరణ వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన అమిత్ షాకు రాసిన లేఖలో కోరారు. తాజాగా తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చిల్లింగ్ సెంటర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి అమూల్ తన బహుళ-రాష్ట్ర సహకార లైసెన్స్‌ను ఉపయోగించినట్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వచ్చిందని స్టాలిన్ చెప్పారు. అలాగే కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, రాణిపేట్, తిరుపత్తూరు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో ఎఫ్‌పిఓలు, ఎస్‌హెచ్‌జిల ద్వారా పాలను సేకరించాలని అమూల్ యోచిస్తోంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement