ఉక్రెయిన్ లో గల్లంతైన విద్యార్థుల కుటుంబాలని పరామర్శించి , వారిలో మనోధైర్యాన్ని పెంచాలని మంత్రులను ఆదేశించారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఉక్రెయిన్ లో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన 225 మంది విద్యార్థులు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. కేబినెట్ సమావేశానికి ముందు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మంత్రి వర్గానికి సమాచారం అందించారు. విద్యార్థులు తిరిగి రావడానికి రెసిడెన్షియల్ కమిషనర్ ,ఇతర సీనియర్ అధికారులు అవసరమైన సమన్వయం చేస్తున్నారని సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పిల్లలను తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. తిరిగి పిల్లలను ఇంటికి చేర్చే పనిని కూడా సమీక్షిస్తోందన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న మధ్యప్రదేశ్‌లోని కుటుంబీకులు కూడా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలుస్తున్నారని తెలిపారు. న్యూఢిల్లీ, ముంబైకి తిరిగి వచ్చిన మధ్యప్రదేశ్ విద్యార్థులకు మధ్యప్రదేశ్ భవన్, మధ్యాంచల్ తదితర ప్రాంతాల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం చెప్పారు. అవసరమైతే వారి ఆహారం, ప్రయాణ టిక్కెట్ల కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉక్రెయిన్ లో గల్లంతైన విద్యార్థుల కుటుంబాలని పరామర్శించండి – సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
Advertisement
తాజా వార్తలు
Advertisement