ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న భగవంత్ మాన్ లు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత్ సర్ లోని జలియన్ వాలా బాగ్ స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం కేజ్రీవాల్ అమృత్‌సర్ లోని గోల్డెన్ టెంపుల్ ని సందర్శించారు. ఆలయంలో ఆయన ప్రార్ధనలు నిర్వహించారు. ఆప్ నుండి విజయం సాధించిన 92 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిరోమణి గురు ద్వారా ప్రభంధక్ కమిటీ పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపటటనున్న భగవంత్ మాన్ , ఢిల్లీ సీఎంలను సన్మానించింది. పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 92 అసెంబ్లీ స్థానాల్లో AAP విజయం సాధించింది. ఈ విజయంతో ఆప్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ దఫా ఆ పార్టీ 18 స్థానాలకే పరిమితమైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..