Tuesday, November 26, 2024

TS | పాలమూరు-రంగారెడ్డిపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష.. కొత్త సచివాలయంలో తొలి భేటీ

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రేపు సమీక్ష చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి సీఎం కార్యాలయ వర్గాలు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం 11 గంటలకు కొత్త సచివాలయంలో సీఎం తొలి సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తో ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు సాగు నీటితోపాటు తాగు నీళ్లు అందనున్నాయి.

ఈ పథకం అనుకున్న మేర ముందుకు సాగకపోవడంతో నేరుగా సీఎం కేసీఅర్ రంగంలో దిగారు. ఆదివారం కొత్త సచివాలయం ప్రారంభించిన విషయం తెలిసిందే. సోమవారం సీఎం కేసీఅర్ సాగు నీటి ప్రాజెక్ట్ పై సమీక్ష చేయనున్నారు. రెండు జిల్లాలకు సంబంధించి సాగు, తాగు నీటిని అందించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఅర్ కొత్త సచివాలయంలో మొట్ట మొదట సమీక్ష చేయనుండటంపై చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఅర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement