Tuesday, November 26, 2024

Telangana: సీఎం కేసీఆర్ పెద్ద‌ప‌ల్లి స‌భ స‌క్సెస్‌.. రోడ్డుకు ఇరువైపులా నిల‌బ‌డి స్వాగ‌తించిన జ‌నం!

రాష్ట్ర ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెద్దపల్లి జిల్లా పర్యటన విజయవంతమైంది. పెదకల్వల వద్ద 50ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసిన సీఎం బహిరంగ సభ స్థలి జనాల‌తో కిక్కిరిసి పోయింది. లక్ష మందికి సరిపడేలా ఏర్పాట్లు చేయగా సీఎం ప్రసంగిస్తున్న సమయంలో కూడ ప్రజలు సభ స్థలివైపు రావడంతో రాజీవ్ రహదారికి ఇరువైపులా రోడ్లు జనంతో నిండిపోయాయి. కరీంనగర్ – పెద్దపల్లి ప్రధాన దారులన్నీ గులాబీమయమయ్యాయి. సీఎం కాన్వాయ్ కరీంనగర్ నుంచి రోడ్డు మార్గంలో జిల్లా సరిహ‌ద్దు సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి నుంచి భూపతిపూర్ , ఐతరాజ్పల్లి , గర్రెపల్లి , నర్సయ్యపల్లి , కాట్నపల్లి , సుగ్లాంపల్లి, చిన్నకల్వల మీదుగా జిల్లా కేంద్రానికి చేరుకుంది.

కాగా, దారి పోడవున సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు, ప్రజలు అభివాదం చేశారు. దారులన్నీ గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, స్వాగత తోరణాలతో నిండిపోయాయి. ముఖ్యమంత్రికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన వస్తున్న సీఎం కేసీఆర్ మధ్యాహ్నం జిల్లాకు చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దాసరి నివాసానికి వెళ్లి భోజనం చేసిన అనంతరం, నేరుగా గౌరెడ్డిపేటకు వెళ్లి టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పెద్ద బొంకూరులో జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడి నుంచి నేరుగా పెద్దకల్వలలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం నేతలు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. స్వరాన్ని పెంచి కేంద్రంపై వాగ్భాణాలు ఎక్కు ఎట్టడంతోపాటు టీఆర్ఎస్ బలం, కార్యకర్తల అండ గురించి మాట్లాడినప్పుడు మంచి స్పందన లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement