దేశ రాజకీయాలు, బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలపై ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం సీఎం కేసీఆర్ సుధీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఈ ఉపన్యాసం పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్‌కు అద్భుతమైన లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంపై కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ దేశరాజకీయాలపై కూలంకషంగా మాట్లాడారని, బీజేపీ అసమర్థ రాజకీయ విధానాలను ఎండగట్టారన్నారు.
సీఎం కేసీఆర్‌తో మీరు ఏకీభవించినా.. ఏకీభవించకపోయినా ఆయన ఉపన్యాసాలు పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు ప్రత్యక్ష పాఠంగా ఉపయోగపడుతాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నర గంటల సుదీర్ఘ ఉపన్యాసం ఈ కోవకు చెందిందే అని అన్నారు. ఎనిమిదేళ్లయినా ఒక్కసారికూడా ప్రెస్‌మీట్‌ను ఎదుర్కోలేనివారు మరికొందరుంటారని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.