మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా జారతకు రానున్నట్టు చెప్పారు. జాతరకు అన్నివర్గాల ప్రజలకు సహరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతరకు విజయవంతం చేయాలన్నారు. మేడారం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా 34పార్కింగ్ ప్లేస్ లను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడా ఏ సమస్య రాకుండా చూసేందుకు జాతరలో మొత్తం 40 వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు.
మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర చాలా కీలకమని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గతంలో 3,300 బస్సులను జాతరకు నడపగా.. ఈసారి మరో 500 పెంచామని, మొత్తం 3,800 బస్సులు నడపనున్నామని చెప్పారు. ఆర్టీసీలో ప్రయాణించే భక్తులు మాత్రమే సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెలకు సమీపంలో దిగుతారని చెప్పారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.